భారత్‌లో మరోసారి రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు

X
దేశంలో కరోనా రోగుల సంఖ్య 51 లక్షలు దాటింది. ఇప్పటివరకు 51 లక్షల 18 వేల 254 మందికి వ్యాధి సోకింది. 24 గంటల్లో 97 వేల 894 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ అయింది. అలాగే గత 24 గంటల్లో 1132 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ వ్యాప్తంగా 82,719 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో.. 83,198 మరణాలు, 40,25,079 డిశ్చార్జ్ లు పోను ప్రస్తుతం యాక్టివ్ కేసులు 10,09,976 గా ఉన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
