India Economic Growth : నాలుగేళ్ల కనిష్టానికి దేశ ఆర్థిక వృద్ధి

దేశ ఆర్ధిక వృద్ధి 2024-25 పూర్తి ఆర్ధిక సంవత్సరంలో నాలుగు సంవత్సరాల కనిష్టానికి తగ్గి 6.5 శాతంగా నమోదైంది. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో ఇది 9.2 శాతంగా ఉంది. కావిడి తరువాత ఇదే అతిపెద్ద వృద్ధి. 20-25 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో మాత్రం 7.4 శాతం జీడీపీ నమోదైంది. జీడీపీ వృద్ధి తగ్గినప్పటికీ ఇప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా ఉందని సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశా రు. శుక్రవారం నాడు కేంద్ర గణాంకాలు, కార్యక్ర మాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంఓఎసీపీఐ), జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన వివరాల ప్రకారం 2024-25 పూర్తి సంవత్సరానికి వాస్తవ జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంది. ఇది ఆర్టీఐ అంచనా వేసిన 6.6 శాతం కంటే కొంచెం తక్కువగా ఉంది. 4వ త్రైమా సికంలో జీడీపీ వృద్ధి 7.2 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. వాస్తవంగా ఇది కొద్దిగా పెరిగి 7.4 శాతంగా నమోదైంది.
ఆర్ధిక ద్రవ్యోల్బణంతో సహా నామినల్ జీడీపీ పూర్తి సంవత్సరానికి 9.8 శాతం పెరిగి 330.68 ట్రిలియన్లకు చేరింది. జనవరి - మార్చి త్రైమా సికంలో మాత్రమే నామినల్ జీడీపీ సంవత్స రా నికి 10.8 శాతం పెరిగి 88.18 ట్రిలియన్లకు చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com