Center Clarifies : గడువు విధించే అధికారం కోర్టులకు లేవు.. సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ

శాసనసభలు ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్లు ఆమోదముద్ర వేయడానికి గడువు విధించే అధికారం కోర్టులకు లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే, అది రాజ్యాంగపరమైన గందరగోళానికి దారితీస్తుందని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లు ఒక నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
ఆ పదవుల గౌరవం తగ్గించినట్లు అవుతుంది
బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి గడువు విధించడం ద్వారా రాష్ట్రపతి, గవర్నర్ల వంటి అత్యున్నత పదవుల గౌరవం తగ్గుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రెండు పదవులు ప్రజాస్వామ్య పాలనలో అత్యంత ఉన్నతమైనవని, వారి అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం సరైన విధానం కాదని తెలిపింది. వారి విధి నిర్వహణలో ఏవైనా లోపాలు ఉంటే, వాటిని న్యాయవ్యవస్థ జోక్యంతో కాకుండా రాజ్యాంగబద్ధమైన యంత్రాంగాల ద్వారానే సరిదిద్దాలని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఇలాంటి జోక్యం వల్ల కొన్ని అనవసర సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని తన అఫిడవిట్‌లో పేర్కొంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com