దేశంలో కోవిడ్ కేసులు..

భారతదేశంలో 12,000కి పైగా తాజా కేసులు నమోదయ్యాయి, క్రియాశీల కేసుల సంఖ్య 67,556కి చేరుకుంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,48,81,877గా నమోదైంది. మొత్తం యాక్టివ్ కేసులు 0.15 శాతం ఉండగా, జాతీయ COVID-19 రికవరీ రేటు 98.66 శాతంగా నమోదైంది. దేశంలో 24 గంటల వ్యవధిలో 12,193 తాజా COVID-19 కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసుల సంఖ్య 67,556కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరల్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,300కి చేరుకుంది. మరో 42 మరణాలు, వీటిలో 10 కేసులు కేరళకు చెందినవే. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.66 కోట్ల యాంటీ కోవిడ్ వ్యాక్సిన్‌లను ప్రజలకు అందించారు.
దేశంలో కోవిడ్ -19 కేసులు పెరగడంతో, కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను- -ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్- - కేసలు మరింత పెరగకుండా కఠిన చర్యలు అమలు పరచాలని కోరింది. అన్ని జిల్లాల్లో నిఘా ఏర్పాటు చేయమని ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. మార్చి 2023 నుండి భారతదేశంలో COVID-I 9 కేసులు స్థిరంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు. ఇది ఆందోళన కలిగిస్తోంది. COVID-I 9 కారణంగా ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, కేసుల నియంత్రణకు అవసరమైన ప్రజారోగ్య చర్యలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని రాజేష్ భూషణ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com