Governor : మహారాష్ట్ర గవర్నర్‌ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా

Governor :  మహారాష్ట్ర గవర్నర్‌ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా
X

మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. రాధాకృష్ణన్‌ రాజీనామాతో గుజరాత్ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు మహారాష్ట్ర గవర్నర్‌గా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అదనపు బాధ్యతలను అప్పగించారు.

జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన సీపీ రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నూతన ఉపరాష్ట్రపతిని జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బుధవారం కలిసి అభినందించారు.

మరోవైపు శుక్రవారం నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్నాయి. మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో బుధవారం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. తాను రాజీపడని జాతీయవాదినని అన్నారు. గవర్నర్‌గా గడిపిన 13 నెలలు తన ప్రజా జీవితంలో అత్యంత సంతోషకరమైన సమయమని, ఈ కాలంలో తాను పరిపాలన, రాజకీయ పరంగా ఎంతో నేర్చుకున్నానని తెలిపారు.

Tags

Next Story