CPM : సీపీఎం జాతీయ కార్యదర్శి ఎన్నికకు ముహూర్తం ఫిక్స్​

CPM : సీపీఎం జాతీయ కార్యదర్శి ఎన్నికకు ముహూర్తం ఫిక్స్​
X

సీపీఎం జాతీయ కార్యదర్శి ఎన్నికకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇటీవల అనారోగ్యంతో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతరాం ఏచూరి అనారోగ్యం కారణంతో మృతి చెందారు. దీంతో సీపీఎం జాతీయ కార్యదర్శి ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు ఆ పోస్టును ఎవరికి ఇస్తారనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతున్న క్రమంలో.. సీపీఎం జాతీయ కార్యదర్శి ఎన్నికకు ముహూర్తం ఖరారు చేసినట్లు ప్రకటించారు. "వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సీపీఎం 24వ అఖిలభారత మహాసభలు మధురైలో జరగనున్నాయి. ఈ అఖిలభారత మహాసభల్లో సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శి ఎన్నిక ఉంటుందని, కొత్త ప్రధాన కార్యదర్శి ఎన్నిక వరకు పొలిటిబ్యూరోకు, సెంట్రల్ కమిటీకి.. సమన్వయకర్తగా ప్రకాష్ కారత్ వ్యవహరించనున్నట్లు సీపీఎం వర్గాలు తెలిపారు.

Tags

Next Story