Kumbh Mela : కుంభమేళా 18వ రోజు పోటెత్తిన భక్త జనం

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళా 18వ రోజు కొనసాగుతోంది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 27 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇవాళ ఉదయం 8 గంటల వరకూ దాదాపు 55 లక్షల మంది నదీ స్నానాలు ఆచరించినట్లు తెలిపింది. మరోవైపు కుంభమేళ జరిగే రోజుల్లో మౌని అమావాస్యను భక్తులు పవిత్రంగా భావిస్తారు. ఈనెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా ఏకంగా 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం తెలిపింది.
భక్తులు సలువుగా నడిచేందుకు వన్‌వే ట్రాఫిక్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ సమీప జిల్లాల నుంచి వస్తున్న వాహనాలను ఆ జిల్లా సరిహద్దులకే పరిమితం చేయనున్నారు. డిస్ట్రిక్ బోర్డర్ల వద్ద వాహనాలను నిలిపివేస్తున్నారు. రద్దీని తగ్గించే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు చాలా కఠిన నిబంధనలు పాటించనున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోకి ఫోర్ వీలర్ వాహనాల ఎంట్రీని నిలిపివేశారు. కోట్ల సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో.. క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com