MP Jaya Bachchan : నదిలో మృతదేహాలు.. ఎంపీ జయాబచ్చన్ హాట్ కామెంట్

మహా కుంభమేళా జలాలు కలుషితమవుతున్నాయంటూ తాజా పరిస్థితులు వివరిస్తూ సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ పార్లమెంట్ బయట చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారనీ.. దీంతో కుంభమేళా నీరు కలుషితమైందని అన్నారు. సామాన్యుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదనీ.. భక్తుల సమస్యలను పరిష్కరించడం లేదని ఆరోపించారు. పార్లమెంట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, కుంభమేళా ఏర్పాట్లు యోగి ప్రభుత్వాన్ని నిందించారు. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. మృతదేహాలు నదిలో పడేయడం వల్ల జలాలు అత్యంత కలుషితం అయ్యాయని అన్నారు. జనవరి 29 నాటి తొక్కిసలాటలో 30 మంది మరణించారు. 60 మందికిపైగా గాయ పడ్డారు. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం కంటితుడుపు చర్య లతో సరిపెట్టింది. మృతదేహాలకు కనీసం పోస్టుమార్టం కూడా నిర్వహించలేదని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com