జాతీయ

Bihar: కల్తీ మద్యం ప్రభావం.. కంటిచూపు కోల్పోవడంతో పాటు మృత్యువాత..

Bihar: లిక్కర్ బ్యాన్ అమల్లో ఉన్న బిహార్‌లో కల్తీ మద్యం అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది.

Bihar: కల్తీ మద్యం ప్రభావం.. కంటిచూపు కోల్పోవడంతో పాటు మృత్యువాత..
X

Bihar: లిక్కర్ బ్యాన్ అమల్లో ఉన్న బిహార్‌లో కల్తీ మద్యం అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది. సారన్ జిల్లాలోని ఛప్రాలో కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. ఛప్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారని అధికారులు తెలిపారు. పట్నా మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.

కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురైన వారిలో 25 మంది కంటిచూపు కోల్పోయారని గ్రామస్థులు చెబుతున్నారు. వాంతులు, విరేచనాలతో మరికొందరు బాధపడుతున్నారని తెలిపారు. కొందరు దేశీ మద్యాన్ని సేవించారని గ్రామస్థులు వెల్లడించారు. మరణాలకు గల కారణాలను తెలుసుకోవడానికి వైద్యులు, పారా మెడికల్ బృందాన్ని గ్రామానికి పంపినట్లు సారన్ జిల్లా కలెక్టర్ రాజేష్ మీనా తెలిపారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES