Kolkata Case : పాలీగ్రాఫ్ టెస్టులో ఆర్జీకర్ ప్రిన్సిపల్ మోసపూరిత సమాధానాలు

Kolkata Case : పాలీగ్రాఫ్ టెస్టులో ఆర్జీకర్ ప్రిన్సిపల్ మోసపూరిత సమాధానాలు
X

కోల్కతా ఆర్జీకర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మోసపూరిత సమాధానాలు ఇస్తున్నారని సీబీఐ తెలిపింది. విచారణలో భాగంగా సందీప్ కు పాలీగ్రాఫ్ టెస్టు, వాయిస్ అనాలసిస్ నిర్వహించారు. ఆయన చెప్పిన జవాబులు మోసపూరితమైనవని ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొ రేటరీ(CFSL) నివేదిక ఇచ్చినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.

అయితే, పాలిగ్రాఫ్ సమాధానాలను సాక్ష్యాలుగా చూపిస్తే కోర్టు పరిగణలోకి తీసుకోదు. దీంతో, ఆ కేసుతో ముడిపడిన ఆధా రాలను సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరో వైపు సంజయ్ రాయ్ు రక్షించేందుకు తాలా పోలీస్ స్టేషన్ ఎస్ఏహెచ్ అభిజిత్ మండల్ ప్రయత్నించారని సీబీఐ ఆరోపించింది

Tags

Next Story