BJP Leader Vinod : రాహుల్, ఖర్గేలకు పరువు నష్టం నోటీసులు..రూ. 100 కోట్లకు వేసిన బీజేపీ నేత వినోద్ తావే

లోక్ సభలో విపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి వినోద్ తావే పరువు నష్టం నోటీసులు పంపారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు ఎదుర్కోవాలంటూ హెచ్చరించారు. ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలోని పాలఘర్ జిల్లాలోని విరార్ ని ఓ హోటల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నేత రూ.5 కోట్లు పంపిణీ చేశారని బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) నాయకుడు హితేంద్ర ఠాకూర్ మంగళ వారం ఆరోపించిన క్రమంలో తాజ్ఞే లీగల్ నోటీసు ఇచ్చారు. డబ్బుల పంపిణీ చేస్తున్నట్లు పత్రికల్లో వార్తలు రాగానే రాహుల్ గాంధీ స్పందిస్తూ ప్రధాని మోడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీకి ఈ రూ.5 కోట్లు ఎక్కడి నుంచి, ఎవరి లాకర్ నుంచి వచ్చాయి? ప్రజల సొమ్మును లూటీ చేసి డబ్బు పంపిందెవరు? అంటూ రాహుల్ ప్రశ్నించారు. డబ్బు, కండ బలంతో మహారాష్ట్రను సేఫ్గ ఉంచుతానని మోడీ వాగ్ధానం చేస్తుండగా.. ఆ పార్టీ నేత రూ.5 కోట్ల నగదుతో రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఎన్నికలు జరగడానికి ముందు రోజు వినోద్ తావేతో అఘాడీ కార్యకర్తలు ఘర్షన పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు మిన్నంటాయి. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ నేతలు తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడి తమ పార్టీని దెబ్బతీయాలని చూశారని ఆరోపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకుగాను కాంగ్రెస్ నేతలు తనకు బహి రంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన తన నోటీసులో డిమాండ్ చేశారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com