Delhi Air Pollution : కాలుష్య కోరల్లో ఢిల్లీ..500 మార్క్ దాటిన ఏక్యూఐ

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు. మంగళవారం సగటు గాలి నాణ్యతా సూచీ (ఏక్యూఐ) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది 500 మార్క్‌ను దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనివల్ల ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాయు కాలుష్యంపై తాజాగా విచారణ జరిపిన సుప్రీం ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడింది. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా? అని ప్రశ్నించారు.కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఓ టేబుల్‌ను పోస్ట్ చేసిన థరూర్.. ‘ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి.ఇలాంటి విపత్కర పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా?’ అని రాసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com