Delhi : ఢిల్లీకి వరుస బెదిరింపులు.. స్కూళ్లు, రద్దీ ఏరియాల్లో తనిఖీలు

Delhi : ఢిల్లీకి వరుస బెదిరింపులు.. స్కూళ్లు, రద్దీ ఏరియాల్లో తనిఖీలు
X

బాంబు బెదిరింపులతో దేశరాజధాని ఢిల్లీ గడగడలాడుతోంది. వరుసగా వస్తున్న బెదిరింపు కాల్స్‌తో పోలీసుల ఉరుకులు పరుగులు కామన్‌ అయ్యాయి. తాజాగా ఆర్కేపురం పరిధిలోని రెండు ప్రైవేటు పాఠశాలలకు ఆగంతకులు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు మెసేజ్‌లు పంపారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందజేశారు. ఫైర్ అధికారులు, పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ ఘటనా స్థలానికి చేరుకుని పాఠశాల ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ మెయిల్ ఎవరు పంపారనే విషయంపై ఆరా తీస్తున్నారు.

Tags

Next Story