Delhi : ఢిల్లీని దట్టంగా కమ్మేసిన పొగమంచు

Delhi : ఢిల్లీని దట్టంగా కమ్మేసిన పొగమంచు
X

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. కాలుష్య నియం త్రణకు అధికారులు ఎన్నిచర్యలు తీసుకున్నా ఫలితం కనిపించట్లేదు. తాజాగా ఇవాళ ఢిల్లీలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. గాలి నాణ్యత 400 పాయింట్లను దాటి పోయింది. ఢిల్లీ పరిసర ప్రాంతాలైన నోయిడా, ఘజియాబాద్, గురుగ్రా మ్, ఫరీదాబాద్ లో కూడా తీవ్రమైన వాయుకాలుష్యం ఏర్పడింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇం టర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తో పాటు చాలా ప్రాం తాల్లో విజుబులిటీ సున్నా స్థాయికి చేరుకుంది. దీంతో రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. ప్రస్తుతానికి విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదని అధికారులు వెల్లడించారు. కానీ విమానాశ్ర యాలకు వెళ్లే ప్రయాణికులు మాత్రం ముందుగా విమానాల సమాచారం తెలుసుకుని వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు పెరిగిన వా యుకాలుష్యం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags

Next Story