ఢిల్లీ చలో మార్చ్‌ : రబ్బరు బుల్లెట్‌ తగిలి జర్నలిస్ట్ కి గాయాలు

ఢిల్లీ చలో మార్చ్‌ : రబ్బరు బుల్లెట్‌ తగిలి జర్నలిస్ట్ కి గాయాలు

ఢిల్లీలోని శంభు సరిహద్దు వద్ద రైతుల 'ఢిల్లీ చలో' మార్చ్‌ను కవర్ చేస్తున్నప్పుడు పోలీసులు రబ్బరు బుల్లెట్ కాల్పులు జరపడంతో ఒక జర్నలిస్ట్ గాయపడ్డాడు. పలు నివేదికల ప్రకారం, గాయపడిన జర్నలిస్ట్ హిందీ న్యూస్ ఛానెల్ ఆజ్ తక్‌కి చెందిన జర్నలిస్ట్ సత్యేంద్ర.

ఢిల్లీ వైపు కవాతు చేస్తున్న నిరసనకారులు పోలీసుల బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించడంతో పంజాబ్-హర్యానా శంభు సరిహద్దులో గందరగోళ దృశ్యాలు కనిపించాయి. శంభు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన రైతులు తమ ట్రాక్టర్లతో సిమెంట్ బారికేడ్‌ను తొలగించేందుకు ప్రయత్నించడం కనిపించింది.

పంజాబ్-హర్యానా శంభు సరిహద్దు వద్ద ఆందోళనకారులు ముట్లీ లేయర్డ్ బారికేడ్లను ఛేదించేందుకు ప్రయత్నించడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రైతులు చేపట్టిన 'ఢిల్లీ చలో' మార్చ్‌ను దృష్టిలో ఉంచుకుని హర్యానాలోని కురుక్షేత్రలో పోలీసులు కాంక్రీట్ స్లాబ్‌లు, ఇనుప మేకులు, బారికేడ్లు, ముళ్ల తీగలు, పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని మోహరించారు.

Tags

Read MoreRead Less
Next Story