CM Revanth : ఢిల్లీకి షీలాదీక్షిత్ లాంటి పాలన రావాలి : రేవంత్

CM Revanth : ఢిల్లీకి షీలాదీక్షిత్ లాంటి పాలన రావాలి : రేవంత్
X

తెలంగాణలో తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఢిల్లీలో చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీని అమలు చేశామని, 55 వేల ఉద్యోగాలు కల్పించామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని వెల్లడించారు. ఢిల్లీలోనూ తమకు అవకాశమిస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి పోస్టర్లను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రైతులకు రుణమాఫీ చేశామన్నారు. నరేంద్రమోదీ, అరవింద్ కేజ్రీవాల్... వీరి పేర్లు మాత్రమే వేర్వేరు అని, కానీ అబద్ధాలు చెప్పడంలో ఇద్దరూ ఒకటే అన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ సీఎం షీలాదీక్షిత్ హయాంలోనే ఎక్కువ డెవలప్ అయిందని రేవంత్ చెప్పారు.

Tags

Next Story