ప్రజలకు భారం లేకుండా విద్యుత్ కొనుగోళ్లు- మంత్రి గొట్టిపాటి రవికుమార్

ఆంధ్రా ప్రజలకు భారం లేకుండా విద్యుత్ కొనుగోళ్లు ఉండాలని విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రానున్న 6 నెలలకు సంబంధించిన విద్యుత్ డిమాండ్, సరఫరాల అంచనాలపై సంబంధిత అధికారులతో సచివాలయంలో సమీక్షఅధికారులతో సచివాలయంలో సమీక్షనిర్వహించారు. విద్యుత్ రంగానికి ఎటువంటి సమస్యలూ ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని డిమాండ్ మేరకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పెరుగుతున్న విద్యుత్ డిమండ్‌కు తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. లో ఓల్టేజ్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ఎస్సి,ఎస్టి వినియో గదారులకు అందించే ఉచిత విద్యుత్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టా లని చెప్పారు.
ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు
వైసీపీ పాలనలో నిర్వీర్యమైన ఏపీ విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాబోయే 6 నెలలకు సంబంధించి విద్యుత్ వినియోగం, డిమాండ్లకు అనుగుణంగా ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలి అనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాలు ప్రజలకు భారం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉచిత విద్యుత్ పై అసత్య ప్రచారం
ఎస్సీ, ఎస్టీలకు అందించే ఉచిత విద్యుత్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,17,298 ఎస్సీ కుటుంబాలకు, 4,75,557 ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది చేకూరుస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లేలా ఉచిత విద్యుత్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని దళిత, గిరిజన సోదరులు నమ్మవద్దని కోరారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. అల్పాదాయ వర్గాలకు అమలు చేస్తు్న్న ఉచిత విద్యుత్ పథకానికి అడ్డంకులు సృష్టించేందుకు కొందరు అపోహలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం దళిత, గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలు చూసి నిరాశతో వైసీపీ తన అనుబంధ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు రాతలు రాయిస్తుందని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com