DMK MP : డీఎంకే ఎంపీకి రూ. 908 కోట్ల పెనాల్టీ

DMK MP : డీఎంకే ఎంపీకి రూ. 908 కోట్ల పెనాల్టీ
X

తమిళనాడులోని అధికార డీఎంకే ఎంపీ ఎస్‌.జగత్రక్షకన్‌కు భారీ షాక్‌ తగిలింది. ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్(ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎంపీతో పాటు ఆయన కుటుంబానికి రూ.908 కోట్ల పెనాల్టీ విధించినట్లు ఈడీ వెల్లడించింది. ఫెమా చట్టంలోని 37A సెక్షన్‌ ప్రకారం 2020 సెప్టెంబర్‌లో సీజ్‌ చేసిన రూ.89.19 కోట్ల మొత్తాన్ని జప్తు చేసినట్లు తెలిపింది. ఈ నెల 26న వచ్చిన తీర్పు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. వ్యాపారవేత్త అయిన జగత్రక్షకన్‌ (76) ప్రస్తుతం అరక్కోణం లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Tags

Next Story