Modi Laddu: ఈ దీపావళికి మరింత ప్రత్యేకంగా మోడీ లడ్డూ..

Modi Laddu: ఈ దీపావళికి మరింత ప్రత్యేకంగా మోడీ లడ్డూ..
X
మోడీ లడ్డూలలో పవిత్రమైన గంగాజలాన్ని కలుతున్నట్లు వెల్లడి..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు భారత్‌తోపాటు విదేశాల్లో కూడా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. అంతేకాదు ప్రజాదరణ పొందిన గొప్ప నేతల్లో మోదీ ముందు వరుసలో ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై ఉన్న అభిమానంతో బీహార్‌కు చెందిన ఓ వ్యాపారి ప్రత్యేకమైన లడ్డూలను తయారు చేస్తున్నారు.

బిహార్‌లోని సంజీవ్‌ శర్మ ఓ స్వీట్‌షాప్‌ నడిపిస్తున్నారు. ఆయనకు మోడీ అంటే ఎంతో ఇష్టం. దీంతో మోడీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు రాయల్‌ లడ్డూలకు ‘మోడీ లడ్డూ’ అనే పేరును పెట్టాడు. ఈ లడ్డూలతో అతడికి మంచి పేరు కూడా వచ్చింది. అయితే, ఈ దీపావళి పండగకు మోడీ లడ్డూలను మరింత ప్రత్యేకంగా తయారు చేయాలనుకున్నారు. అందుకనే దీపావళి సందర్భంగా తయారు చేసే లడ్డూలలో పవిత్రమైన గంగాజలాన్ని కలుపుతున్నట్లు ఆ స్వీట్ షాప్ వ్యాపారి వెల్లడించారు.

ఇక, మోడీ తొలిసారి ప్రధాని అయినప్పుడు ఆయన గౌరవార్థం మోడీ లడ్డూలను తయారు చేశామని వ్యాపారి సంజీవ్ శర్మ తెలిపారు. ఈ లడ్డూలకు ఎంతో ప్రజాదరణ రావడంతో పాటు నాకు మంచి పేరు కూడా వచ్చిందన్నారు. ఈ లడ్డూల తయారీలో దేశీయంగా తయారైన నెయ్యి, కుంకుమ పువ్వు, బాదం, పిస్తాలను వినియోగిస్తున్నాం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి పార్లమెంట్ సభ్యులు కాబట్టి.. ఈ దీపావళికి ప్రత్యేకంగా పవిత్రమైన గంగాజలంతో మోడీ లడ్డూలను తయారు చేస్తున్నామన్నారు. ఈ లడ్డూలతో గంగా, యమున, సరస్వతి నదుల నాగరికత చరిత్రను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలనేది నా యొక్క ఉద్దేశం అని స్వీట్ షాప్ వ్యాపారి సంజీవ్‌ శర్మ పేర్కొన్నారు.

Tags

Next Story