TVK : బీజేపీతో పొత్తు పెట్టుకోం.. పొత్తులపై టీవీకే క్లారిటీ

TVK : బీజేపీతో పొత్తు పెట్టుకోం.. పొత్తులపై టీవీకే క్లారిటీ
X

తమిళ నటుడు విజయ్ ఏర్పాటు చేసిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పొత్తులపై క్లారిటీ ఇచ్చింది. 2026 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ బీజేపీతో పొత్తు ఉండబోదని పేర్కొంది. తమ పార్టీ తరఫున విజయ్ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు ఆ పార్టీ కార్య నిర్వాహక కమిటీ తెలిపింది. ఈ మేరకు పలు తీర్మానాల ను పార్టీ ఆమోదించింది. వచ్చే నెలలో పెద్ద ఎత్తున రాష్ట్ర సదస్సును నిర్వహించాలని పార్టీ ప్రతిపాదించింది. పార్టీ సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన టీవీకే రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశానికి విజయ్ నాయకత్వం వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఆంగ్ల భాషపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గపు ఉద్దేశాలను కలిగి ఉన్నాయని కమిటీ పేర్కొంది. తమిళనాడుపై హిందీ, సంస్కృత భాషలను రుద్దడాన్ని తమ పార్టీ ఎప్పటికీ అంగీకరించదని టీవీకే పేర్కొంది.

Tags

Next Story