Drone Bomb : మణిపూర్‌లో డ్రోన్ బాంబు దాడులు.. పలు జిల్లాల్లో కర్ప్యూ
మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ, మైతీల ఘర్షణలతో కొన్ని నెలల కిందట అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మరోసారి ఉద్రిక్తంగా మారింది. అక్కడ రాకెట్, డ్రోన్ బాంబు దాడులతో భీతావహ వాతావరణం నెలకొంది. తాజా ఘర్షణల్లో సుమారు 11మంది ప్రాణాలు కోల్పోయారు.
సోమవారం కూడా మణిపూర్ లో పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. శాంతిభద్రతల దృష్ట్యా తూర్పు, పశ్చిమ ఇంఫాల్ జిల్లాల్లో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా యంత్రాగం ప్రకటన విడుదల చేసింది. ఐదురోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిషేధించింది. అయితే, కర్ప్యూ సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు.
ఈసారి దాడులకు డ్రోన్లు, క్షిపణులను వినియోగిస్తున్నారు. సంక్షోభాన్ని పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విద్యార్థులు నిరసనలకు దిగుతున్నారు. దీంతో. కేంద్రం అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని మానిటర్ చేస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com