NASA Launches : జాబిల్లిపైకి డ్రోన్

చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ కోసం నాసా వరుస ప్రయోగాలు చేస్తోంది. తాజాగా చంద్రుడి దక్షిణధువం వద్ద దిగేలా ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన లూనార్ ల్యాండర్ ను ప్రయోగించింది. దీనిద్వారా చంద్రుడిపై సూర్య కిరణాలు పడని ఓ బిలంపైకి డ్రోన్ పంపాలని భావిస్తోంది. ఇంట్యూటివ్ మెషిన్స్ అభివృద్ధి చేసిన అధీనా ల్యాండర్ను స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లో అంతరిక్షంలోకి పంపింది. నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి దూసుకెళ్లిన ఈ రాకెట్, మార్చి 6న జాబిల్లి దిగేలా ప్లాన్ చేశారు. 15 అడుగుల ఎత్తయిన ఈ అధీనా ల్యాండర్ దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో ల్యాండ్ కానుంది. ఈ ప్రాంతం జెట్ బ్లాక్ బిలానికి కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ బిలంపైకి గ్రేస్ అనే డ్రోన్ పంపాలన్నది నాసాలక్ష్యం. మూడడుగుల ఈ డ్రోన్, జాబిల్లి ఉపరితలంపై మూడు కీలక పరీక్షలు నిర్వహించనుంది. ఇందులో హైడ్రోజన్ ఫ్యూయల్ థ్రస్టర్లను ఉపయోగించారు. దీంతో డ్రోన్ ఎగురుతుంది. నావిగేషన్ కోసం కెమేరా, లేజర్లను ఏర్పాటుచేశారు. డ్రోన్ ఎగురుతుండగా, దీనిలోని పరికరాలు జాబిల్లి ఉపరితలాన్ని అన్వేషిస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com