Droupadi Murmu : వికసిత్ భారత్ నిర్మాణంలో లోక్ మంథన్ కీలక పాత్ర : ద్రౌపది ముర్ము

Droupadi Murmu : వికసిత్ భారత్ నిర్మాణంలో లోక్ మంథన్ కీలక పాత్ర : ద్రౌపది ముర్ము
X

వికసిత్ భారత్ నిర్మాణంలో లోక్ మంథన్ ప్రముఖ పాత్ర పోషిస్తుంద ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన లోక్ మంథన్ కార్యక్రమా న్ని రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత దేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. వాటిని ప్రతిబింబించేలా లోక్ మంథన్ నిర్వహిస్తున్నారని అన్నారు. వనవాసి, గ్రామ వాసి, నగర వాసి సమ్మే ళనమే ఇదని తెలిపారు. భారతీయ సం స్కృతిని, ఐక్యతను లోక్ మంథన్ చాటి చెబుతుందని చెప్పారు. దేశ ఐక్యతను ప్రతిబింబింపజేస్తుందని వివరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా లోక్ మంథన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భారతీయుల ఐక్యత, విద్య, విజ్ఞానం, పర్యావరణంపై సమాలోచనలు జరుగు తాయని అన్నారు. పర్యావరణ మార్పులు ఆదివాసీల జీవన ప్రమాణాలను దెబ్బతీ స్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆదివాసీల జీవన శైలిపై చర్చ జరుగుతోందని చెప్పారు. ఇందుకు పరిష్కార మార్గాలను చూపుతోందని అన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. హైదరా బాద్ నగరం విభిన్న సంస్కృతులు, సం ప్రదాయాలకు నిలయమని అన్నారు. భారత దేశాన్ని ప్రపంచంలోనే అగ్రభా గాన నిలిపేందుకు ఐక్యంగా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. ఢిల్లీకి రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన నిమిత్తం హై దరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఉదయం తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆమెకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క బేగంపేట మినాశ్రయం లో జ్ఞాపిక అందించి వీడ్కోలు పలికారు.

Tags

Next Story