ED Raids : చెన్నైలో డీఎంకే మంత్రి, నేతల ఇళ్లలో ఈడీ సోదాలు

ED Raids : చెన్నైలో డీఎంకే మంత్రి, నేతల ఇళ్లలో ఈడీ సోదాలు
X

తమిళనాడు మంత్రి కేఎన్‌ నెహ్రు, ఆయన కుమారుడు, లోక్‌సభ సభ్యుడు అరుణ్ నెహ్రూకు సంబంధించిన నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. తమిళనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేఎన్‌ నెహ్రూ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే ఈడీ అధికారులు.. నెహ్రుకు సంబంధించిన నివాసాలకు చేరుకున్నారు. అయితే, మంత్రి నెహ్రూ సోదరుడు ఎన్. రవిచంద్రన్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ట్రూ వాల్యూ హోమ్స్‌ TVHలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు ఈడీ అధికారులు తెలిపారు. దానికి సంబంధించే ఈ సోదాలు జరుగుతున్నాయి. TVH 1997లో స్థాపించబడింది. రాష్ట్రంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా గుర్తింపు ఉంది.

Tags

Next Story