ED Raids : తమిళనాడు మంత్రి పెరియసామి ఇంట్లో ఈడీ సోదాలు..!

ED Raids : తమిళనాడు మంత్రి పెరియసామి ఇంట్లో ఈడీ సోదాలు..!
X

తమిళనాడు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఐ. పెరియసామి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు చెన్నై, మధురై, మరియు దిండిగల్ సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగాయి. ఈడీ అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ సోదాలను నిర్వహించారు. 2006-2010 మధ్య కాలంలో పెరియసామి రూ. 2.01 కోట్ల విలువైన అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్ డైరెక్టరేట్ (DVAC) దర్యాప్తు చేసింది. ఈ కేసులో దిండిగల్ ట్రయల్ కోర్టు పెరియసామి మరియు అతని కుటుంబ సభ్యులను నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, మద్రాస్ హైకోర్టు ఇటీవల దిగువ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసి, కేసును తిరిగి విచారణ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రికి సంబంధించిన ఇతర అక్రమ ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈడీ అధికారులు దిండిగల్‌లోని పెరియసామి నివాసంలో, అలాగే ఆయన కుమారుడు, ఎమ్మెల్యే ఐ.పి. సెంథిల్ కుమార్ , కుమార్తె నివాసాలలో కూడా సోదాలు చేశారు.ఈడీ అధికారులు వివిధ డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు, ఆర్థిక రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Tags

Next Story