Siddaramaiah : ముడా కేసులో సిద్ధ రామయ్యకు ఈడీ షాక్

ముడా మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు ఇతరులకు చెందిన రూ.300 కోట్ల విలువైన 142 ఆస్తులను అటాచ్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని, విపక్షాలు తనపై రాజకీయ కక్షతోనే కుట్ర పన్నారని సీఎం చెబుతున్నారు.
పార్వతమ్మ పేర ఉన్న కొన్ని భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం మైసూర్అర్బన్డెవలప్మెంట్అథారిటీ (ముడా) సేకరించింది. దీంతో ముడా ఆమెకు వేరే చోట భూమి కేటాయించింది. సిద్ధ రామయ్య సీఎంగా ఉన్న సమయంలో ఇదంతా జరిగింది. దీంతో సీఎం సిద్ధ రామయ్య ఖరీదైన స్థలాలను సొంత ఫ్యామిలీకి కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సామాజిక కార్యకర్తలు ఈ ఇష్యూపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com