Anil Ambani : అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

Anil Ambani : అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు
X

రూ.17 వేల కోట్ల రుణాల మోసం కేసులో అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈడీ విచారణకు ఆయన ఆగస్టు 5న హాజరు కావాలని ఆదేశించింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్లకు పైగా రుణాలను దారి మళ్లించాయని ఈడీ ఆరోపిస్తోంది. ఈ రుణాల మంజూరులో అక్రమాలు జరిగాయని, ఈ నిధులు షెల్ కంపెనీల ద్వారా చేతులు మారాయని ఈడీ అనుమానిస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దాఖలు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తును ప్రారంభించింది. సమన్లు జారీ చేయడానికి ముందు, ఈడీ అధికారులు ముంబై, ఢిల్లీలలోని అనిల్ అంబానీ గ్రూప్‌కు సంబంధించిన 35కు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలకమైన పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కూడా గతంలో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ రూ.10,000 కోట్లు దారి మళ్లించిందని ఆరోపించింది. ఈ నిధులు కూడా ఈడీ దర్యాప్తు పరిధిలోకి వస్తాయి.

Tags

Next Story