Eid-al-Adha: ఘనంగా బక్రీద్‌ వేడుకలు

Eid-al-Adha: ఘనంగా బక్రీద్‌ వేడుకలు
దేశవ్యాపంగా ఈద్-అల్-అదా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలను నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా వివిధ నగరాల్లోని ప్రధాన ఈద్గాలు, మసీదుల్లో ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు

దేశవ్యాపంగా ఈద్-అల్-అదా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలను నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా వివిధ నగరాల్లోని ప్రధాన ఈద్గాలు, మసీదుల్లో ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. అల్లాపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ.. త్యాగాలకు మారు పేరుగా తాము బక్రీద్ పర్వ దినాన్ని జరుపుకుంటున్నామని ముస్లీం సోదరులు తెలిపారు.

హైదరాబాద్‌లోని పలు దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముస్లీం సోదరుల సామూహిక ప్రార్థనలతో అన్ని ఈద్గాలు, మసీదులు కిటకిటలాడుతున్నాయి. అటు ఆగ్రాలోని తాజ్‌మహల్‌ వద్ద ప్రార్థనలు చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, యూపీ, కర్నాటక.. ఇలా అన్ని ప్రధాన నగరాల్లోను ముస్లీంలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

రంజాన్‌ మాదిరే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా అనే ధార్మిక ప్రసంగంతో ప్రారంభిస్తారు. సామూహిక ప్రార్థనల తర్వాత ఖుర్బానీ పేరిట జంతువులను బలిస్తారు. ఖుర్బానీ అంటే బలిదానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలున్నాయని ముస్లీం పెద్దలు అన్నారు. ఖుర్బానీ ఇవ్వడానికి హజరత్ ఇబ్రహీం అనే ప్రవక్త త్యాగమే కారణమని చెప్తారు. ఇక బక్రీద్ రోజున మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగించడం ఆనవాయితీ అని ముస్లీం సోదరులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story