Elephant : ఇళ్ల మధ్యకు దూసుకొచ్చిన ఏనుగు
X
By - Manikanta |10 Oct 2024 8:45 AM IST
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో ఓ ఏనుగు నివాస ప్రాంతంలోకి వచ్చింది, దాంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హరిద్వార్ నగరంలోని ప్రధాన రహదారిపైకి వచ్చిన అడవి ఏనుగు స్థానికులపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. స్థానికులు ఏనుగు నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. అటుగా వెళ్తున్న బస్సును ఏనుగు వెంబడించింది. ఆ ఏనుగు గంగా నది దాటి నగరంలోకి ప్రవేశించిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. హరిద్వార్ పరిసర ప్రాంతాల్లోని వరి, చెరుకు పంటల నిల్వల కోసం ఏనుగులు నగరంలోకి వస్తుంటాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఈ విజువల్స్ వైరల్‌గా మారాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com