Terrorists Encounter : పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్లో జైషే మహమ్మ ద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు టెర్ర రిస్టులు హతమయ్యారు. త్రాల్ లోని నాదిల్ గ్రామంలో ఇద్దరు, ముగ్గురు టెర్రరిస్టులు ఉన్నా రన్న సమాచారం మేరకు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. అక్కడ ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. ఎన్ కౌంటర్ లో చనిపోయిన టెర్రరిస్టులను ఆసిఫ్ అహ్మద్ షేక్, ఆమీర్ నజీవ్ వామీ, యవార్ అహ్మద్ భట్ గా గుర్తించారు. వీరిలో ఆసిఫ్ అహ్మద్ షేక్ అవంతిపురా జేషే జిల్లా కమాండర్ గా కొ నసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. 2022 నుంచి అతనికి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయి. మరో ఉగ్రవాది ఆమీర్ 2024 నుంచి పుల్వామా ప్రాంతంలో చురుగ్గా ఉగ్రదాడుల్లో పాల్గొంటున్నాడు. యవార్ అహ్మద్ భట్ కూడా గత ఏడాది కాలంగా పు ల్వామాలో పూర్తి స్థాయిలో ఉగ్రవాద కార్యక లాపాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మొన్న లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు ఎన్ కౌంటర్లో చనిపోయిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూకశ్మీర్ ప్రాం తాన్ని జల్లెడ పడుతున్న భద్రతా దళాలు ఆపరే షన్ కెల్లర్ పేరుతో టెర్రరిస్టులను ఒక్కొక్కరిగా మట్టుబెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com