Jammu Kashmir : జమ్ములో టెర్రరిస్టులతో ఎన్ కౌంటర్.. సోల్జర్ వీరమరణం

Jammu Kashmir : జమ్ములో టెర్రరిస్టులతో ఎన్ కౌంటర్.. సోల్జర్ వీరమరణం
X

సర్ప వినాశ్ లో భాగంగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. కుప్వారా జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి పాకిస్థాన్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌ జరిపిన దాడిని మన సైన్యం భగ్నం చేసింది. అక్కడ ఎదురు కాల్పుల్లో ఒక భారత సైనికుడు వీరమరణం పొందాడు. ఆర్మీ మేజర్‌ సహా నలుగురు గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో ఓ పాకిస్థానీ ఉగ్రవాదిని భారత సైన్యం మట్టుబెట్టిందని అధికారులు వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.

మచల్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌ వైపు వెళ్తున్నవారిని భద్రతా దళాలు పసిగట్టాయి. దీంతో వారిని ప్రశ్నించేలోపే.. పాక్ ఆర్మీకి చెందిన బ్యాట్ స్క్వాడ్ కాల్పులు జరిపి వెనక్కి పరుగులు తీసింది. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు 3 గంటల పాటు ఇరువైపులా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో భారత ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఆర్మీ మేజర్ సహా మరో నలుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌లోని కొండ జిల్లాల ఎగువ ప్రాంతాలలో సుమారు 40 నుండి 50 మంది పాకిస్తానీ ఉగ్రవాదుల బృందం దాక్కున్నట్లు సమాచారం. వారిని పట్టుకోవడానికి భద్రతా దళాలు ఈ ప్రాంతాల్లో భారీ సెర్చ్‌ ఆపరేషన్లను కొనసాగిస్తున్నాయి.

Tags

Next Story