సుకన్య సమృద్ధి యోజనలో చేరారా.. మీ ఖాతా క్లోజవుతుంది.. జాగ్రత్త

సుకన్య సమృద్ధి యోజనలో చేరారా.. మీ ఖాతా క్లోజవుతుంది.. జాగ్రత్త

మోడీ (Modi) వచ్చాక వచ్చిన అనేక మంచి పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన ఒకటి. బేటీ బచావో.. బేటీ పడావో నినాదంలో భాగంగా తీసుకొచ్చిన స్కీమ్ ఇది. మహిళలు, పిల్లల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం ఏదో ఒక పథకం.. వాటిని కొనసాగించడానికి పలు నిబంధనలు అమలు చేస్తున్నాయి. చాలామంది స్కీముల్లో చేరతారు.. కానీ కొనసాగించరు. అందుకే సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి కీలక అప్ డేట్ ఇప్పుడు తెలుసుకుందాం.

మంచి వడ్డీ అందించే సుకన్య సమృద్ధి ఖాతాను యాక్టివ్‌గా ఉంచడానికి మినిమం బ్యాలెన్స్ అవసరం. పెట్టుబడిదారుడు కనీస నిల్వను మెయిన్ టెయిన్ చేయకపోతే, అతని ఖాతా సస్పెండ్ అవుతుంది. ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసినందుకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. మర్చి 31, 2024 నాటికి, ఖాతాదారులు తప్పనిసరిగా కనీస బ్యాలెన్స్‌ను మెయిన్ టెయిన్ చేయాలి. లేకపోతే ఖాతా ఇనాక్టివ్ అవుతుంది. ఆ తర్వాత అనవసరంగా పెనాల్టీ చెల్లించి యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది.

బాలికల కోసం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజనలో మినిమం బ్యాలెన్స్ రూ. 250. ఖాతాదారుడు ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇనాక్టివ్ అయిన ఖాతాను యాక్టివేట్ చేయాలంటే రూ.50 చెల్లించాలి. సుకన్య సమృద్ధి యోజన 8.2 శాతం వడ్డీని అందిస్తుంది. పెట్టుబడిదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 కట్టొచ్చు. గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.

ఈ స్కీం 21 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఆడ బిడ్డకు 18 సంవత్సరాలు నిండినప్పుడు, ఆమె సుకన్య సమృద్ధి ఖాతా నుండి మొత్తంలో 50శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందులో పెట్టే పెట్టుబడికి పన్ను మినహాయింపు కూడా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story