EPFO : ఏటీఎంనుంచి పీఎఫ తీసుకోవచ్చు

ఈపీఎఫ్ఓ కోట్లాది మంది సభ్యులకు గుడ్ న్యూస్ తెచ్చింది. త్వరలో ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈపీఎఫ్ఓ తన కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈపీఎఫ్ఓ 3.0ను ఈ నెలలో ప్రారంభించబోతోందని తెలుస్తున్నది. ఈ కొత్త వ్యవస్థ కింద పీఎఫ్ ఖాతాదారులు ఏటీఎం నుంచి పీఎఫ్ విత్‌డ్రా చేయడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు బ్యాంక్ ఖాతా, ఆధార్‌ను లింక్ చేయడం చాలా ముఖ్యం. దీనికి చివరి తేదీ జూన్ 30గా నిర్ణయించారు. ప్రతిదీ లింక్ అయిన తర్వాత ఏదైనా ఏటీఎంకు వెళ్లాలి. అక్కడ కార్డును ఇన్‌సెర్ట్ చేసి పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రారంభంలో పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తంలో 50 శాతం వరకు తీసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com