Parliament Budget : పార్లమెంట్ బడ్జెట్ సెషన్ కు అంతా రెడీ

31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు శుక్రవారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. పార్లమెంట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. రెండో విడత సమావేశాలు మార్చి 10న మొదలై.. ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ మేరకు పార్లమెంటరీ బులిటెన్ విడుదలైంది. ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అదేరోజు ఎకనామిక్ సర్వేను కూడా ప్రవేశపెడతారు. రాబోయే సమావేశాల్లో సభను సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీలూ సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరనుంది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరిగిన పార్లమెంట్ రెండు సమావేశాల్లో గందరగోళం నెలకొంది. దాంతో పార్లమెంట్ ప్రతిష్ట దెబ్బతిందని, ఈ సమావేశాల్లోనైనా ప్రతిపక్ష నాయకులు, ఇతర ఎంపిలు చర్చల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com