Popular Social Media X : కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ దావా

Popular Social Media X : కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ దావా
X

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఎక్స్ కార్నటక హైకోర్టులో భారత ప్రభుత్వంపై దావా వేసింది. ట్విటర్ ను కొనుగోలు చేసిన తరువాత ఎలాన్ మస్క్ దాన్ని ఎక్స్ మార్చారు. చట్టవిరుద్ధమైన కంటెంట్ నియంత్రణ, ఏకపక్ష సెన్సార్ షిఫ్ ను కోర్టులో ఎక్స్ సవాల్ చేసింది. ప్రధానంగా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) వినియోగంపై ఎక్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సెక్షన్ సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని, ఆన్లైన్ స్వేచ్ఛా వ్యక్తీకరణను దెబ్బతీస్తోందని ఎక్స్ తెలిపింది. సెక్షన్ 69ఏలో వివరించిన నిర్మాణాత్మక చట్టపరమైన ప్రక్రియను దాటవేస్తూ, సమాంతర కంటెంట్ బ్లాకింగ్ యంత్రాంగాన్ని ఏర్పాటుకు ప్రభుత్వం ఈ సెక్షన్ ను ఉపయో గిస్తోందని దావాలో ఎక్స్ ఆరోపిం చింది. శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీం కోర్టు 2015లో ఇచ్చిన తీర్పుకు ఈ విధానం విరుద్ధంగా ఉందని ఎక్స్ వాదిస్తోంది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రకారం సెక్షన్ 79(3) (బీ) కోర్టు ఉత్తర్వు లేదా ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా ఆదేశించిచబడినప్పుడు ఆన్లైన్ ప్లాట్ ఫారమ్ నుంచి చట్టవిరుద్ధమైన కంటెంట్ ను తొలగించాలని ఆదేశించవచ్చు. ఇలాంటి ఆదేశాలను ఆయా సంస్థలు 36 గంటల్లోపు అమలు చేయాలని, ఈ విషయంలో నిబంధనలు పాటించడంలో విఫలమైతే అది చట్టంలోని 79 (1) కింద దాని రక్షణలను కోల్పోతుంది.

Tags

Next Story