AFSPA Act : ఈశాన్య రాష్ట్రాల్లో అఫ్సా చట్టం పొడిగింపు

AFSPA Act : ఈశాన్య రాష్ట్రాల్లో అఫ్సా చట్టం పొడిగింపు
X

కల్లోలిత పరిస్థితులు నెలకొన్న ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని (అఫ్సా) కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఆదివారం ప్రకటన చేసింది. మణిపూర్ అంతటా అఫ్సా చట్టాన్ని ఆరు నెలలు పొడిగించారు, 13 పోలీస్ స్టేషన్ల పరిధి మినహా రాష్ట్రమంతా సాయుధ దళాల చట్టం అమలవుతుంది. అలాగే, నాగాలాండ్లోని ఎనిమిది జిల్లాలు, మరో ఐదు జిల్లాల్లోని 21 పోలీస్ స్టేషన్ ప్రాంతాలకు కూడా ఆరు నెలల పాటు అఫ్సాను పొడిగించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ తెలిపింది. అలాగే ఈ చట్టాన్ని అరుణాచల్ ప్రదేశ్ లోని తిరప్, చాంగ్లింగ్, లాంగ్డింగ్ జిల్లాలు, నామ్సాయి జిల్లాలోని మూడు పోలీస్ స్టేషన్ ప్రాంతాలకు కూడా విస్తరించారు.

Tags

Next Story