Pawan Kalyan–Vijay : టీవీకే విజయ్ తో పవన్ మంతనాలా.. ఏంటీ ఫేక్ ప్రచారం..

Pawan Kalyan–Vijay : టీవీకే విజయ్ తో పవన్ మంతనాలా.. ఏంటీ ఫేక్ ప్రచారం..
X

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మీద వచ్చినన్ని ఫేక్ ప్రచారాలు బహుషా ఇంకెవరి మీద రాలేవేమో అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మీద ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు టీవీకే పార్టీ అధినేత విజయ్ తో పవన్ కల్యాణ్‌ ఎన్డీయేలో చేరేందుకు మంతనాలు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మామూలు లోకల్ మీడియాలో వస్తే ఓకే గానీ.. ఏకంగా నేషనల్ మీడియాలో ఈ వార్తలు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. టీవీకే విజయ్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. కరూర్ తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు. ఆ కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణ ఎదుర్కుంటున్నాడు విజయ్. దాంతో పాటు ఆయన నటించిన జననాయగన్ మూవీ విడుదల కాకుండా వాయిదా పడుతూ వస్తోంది. ఆ సినిమా విషయంలో సెన్సార్ బోర్డుతో విజయ్ కు వివాదాలు నడుస్తున్నాయి.

ఇంకోవైపు తన భార్య విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కింది. సీనియర్ హీరోయిన్ తో విజయ్ కు ఇల్లీగల్ ఎఫైర్ ఉంది అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఇవన్నీ విజయ్ కు ఆదిలోనే కష్టాలు తీసుకొచ్చి పెడుతున్నాయి. దాంతో విజయ్ ను ఈ కేసుల్లో నుంచి బయట పడేసేందుకు పవన్ కల్యాణ్‌ చర్చలు జరుపుతున్నారని.. ఎన్డీయేలో చేరితో వీటి నుంచి బయటపడేస్తామంటూ విజయ్ తో పవన్ కల్యాణ్‌ మాట్లాడుతున్నారంటూ కథనాలు వస్తున్నాయి.

వాస్తవానికి పవన్ కల్యాణ్‌ ఒక్కసారి కూడా విజయ్ తో మాట్లాడలేదు. పవన్ తమిళనాడు వెళ్లలేదు. విజయ్ ఏపీకి రాలేదు. వీరిద్దరూ కలసుకోలేదు. కనీసం మాట్లాడుకోలేదు. కానీ ఏవో ఫేక్ న్యూస్ లు క్రియేట్ చేసేస్తున్నారు. విజయ్ తనకు సిద్ధాంత పరంగా బీజేపీతో శత్రుత్వమే తప్ప మిత్రుత్వం ఉండదని ఇప్పటికే చెప్పేశారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అయినా పవన్ కల్యాణ్‌ మంతనాలు జరుపుతున్నారని చెప్పడం పెద్ద ఫేక్ వార్త అనే అంటున్నారు జనసైనికులు.

Tags

Next Story