ఘోర ప్రమాదం.. కారు లోయలో పడి అయిదుగురు IMS విద్యార్ధులు మృతి

ముస్సోరీ డెహ్రాడూన్ మార్గ్ జాడిపానీ రోడ్‌లోని పానీ వాలా బ్యాండ్ సమీపంలో కారు అదుపు తప్పి లోతైన గుంతలోకి పడి ఐదుగురు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన చోటుచేసుకుంది. డెహ్రాడూన్ IMS కాలేజీకి చెందిన నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలతో కూడిన ఈ బృందం ముస్సోరీకి వెళ్లిన తర్వాత డెహ్రాడూన్‌కు తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, నాన్సీ అనే యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం, నాన్సీకి ఇంటెన్సివ్ కేర్ లో ఉంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని ఎస్పీ సిటీ ప్రమోద్ కుమార్ తెలిపారు.
వారు ముస్సోరీ నుండి డెహ్రాడూన్‌కు తిరిగి వస్తుండగా చునాఖాన్ సమీపంలో కారు అదుపు తప్పి లోతైన లోయలో పడింది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. ముస్సోరీ పోలీస్, ఫైర్ సర్వీస్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com