Nashik-Pune Accident : ఘోర రోడ్డు ప్రమాదం... 9 మంది దుర్మరణం

Nashik-Pune Accident : ఘోర రోడ్డు ప్రమాదం... 9 మంది దుర్మరణం
X

మహారాష్ట్రలోని నాసిక్-పుణే హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఐచర్ ప్యాసింజర్లతో వెళ్తోన్న మాక్సిమోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మాక్సిమో ముందున్న బస్సును ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం ధాటికి మాక్సిమో నుజ్జునుజ్జయింది. పుణే సమీపంలోని నారాయణ్‌గావ్ రోడ్డుపై ఈ యాక్సిడెంట్ అయింది. ఇది ఇలా ఉంటే షిరిడీలో మరో ప్రమాదం జరిగింది. షిరిడీ విహార యాత్ర ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. భవనగిరి జిల్లాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం షిరిడీ పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో షిరిడీ సమీపంలో వారు వెళ్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా.. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆరునెలల చిన్నారి ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags

Next Story