జమ్మూకశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్.. సైన్యానికి చిక్కిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాల్పుల సమయంలో ఒక ఆర్మీ జవానుకు స్వల్ప గాయాలు కాగా...చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
దోడా-ఉధంపూర్ సరిహద్దులోని ఎత్తైన దూదు బసంత్ఢ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారని పక్కా సమాచారంతో భద్రత బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో సైనిక బలగాలు వారిని దీటుగా ఎదుర్కొన్నారు. పలువురు ఉగ్రవాదులను చుట్టూ ముట్టి వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. పట్టుబడ్డ ఉగ్రవాదులు నిషేధిత జైషే మహ్మద్ సంస్థకు చెందిన వారని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి.
కాగా కిష్త్వార్ జిల్లాలో కూడా మరో ఎన్‌కౌంటర్ జరుగుతోందని వార్తలు రాగా.. ఆపరేషన్ కేవలం ఉధంపూర్ జిల్లాకే పరిమితమైందని సైన్యం స్పష్టం చేసింది. వైట్ నైట్ కార్ప్స్ 'ఎక్స్' వేదికగా "దోడా-ఉధంపూర్ సరిహద్దులో ఉగ్రవాదుల కదలికలను గుర్తించాం, ఆపరేషన్ కొనసాగుతోంది" అని ప్రకటించింది. ఈ ఎన్‌కౌంటర్ జరుగుతున్న విషయాన్ని జమ్మూ ఐజీపీ కూడా ధ్రువీకరించారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com