Naval Dockyard Mumbai: నావల్ డాక్ యార్డ్‌లో అగ్నిప్రమాదం.. ముగ్గురు నేవీ సిబ్బంది మృతి..

X
By - Divya Reddy |19 Jan 2022 6:50 AM IST
Naval Dockyard Mumbai: మహారాష్ట్రలోని ముంబై నావల్ డాక్ యార్డ్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
Naval Dockyard Mumbai: మహారాష్ట్రలోని ముంబై నావల్ డాక్ యార్డ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఐఎన్ఎస్ రణ్‌వీర్ నౌకలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నేవీ సిబ్బంది మృతి చెందారు. మరో 11 మంది గాయపడగా.. వారంతా ముంబైలోని నౌకాదళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతకుముందు ప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. మరోవైపు ఈ ఘటనపై నేవీ అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com