Madhya Pradesh: ప్రైవేటు ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి..

Madhya Pradesh: ప్రైవేటు ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి..
X
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేటు ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జబల్‌పూర్‌లోని న్యూలైఫ్‌ మల్టీ స్పెషాలిటీ అనే ప్రైవేటు ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగిసినపడిన మంటలకు 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు.

మిగిలిన వార్డుల్లోని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆస్పత్రిలో విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో అగ్నిప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Tags

Next Story