Sharmishta Panoli : ఫైర్ బ్రాండ్‌లకే ఫైర్ బ్రాండ్.. శర్మిష్ట పనోలి గురించి తెలుసుకోండి

Sharmishta Panoli : ఫైర్ బ్రాండ్‌లకే ఫైర్ బ్రాండ్.. శర్మిష్ట పనోలి గురించి తెలుసుకోండి
X

22 సంవత్సరాల వయస్సు ఉన్న శర్మిష్ట పనోలీ పూనే లా స్కూల్లో నాల్గవ సంవత్సరం చదువుతున్నారు. ఆమె 2022 మొదట్లో తన లీగల్ జర్నీ మొదలుపెట్టారు. ఏ విషయంపైన అయిన సరే తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా అవతరించారు. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కు ఈ వార్త రాసే సమయానికి 94 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. సామాజిక, రాజకీయ అంశాలపై వ్యాఖ్యానంతో కూడిన ఆమె వీడియోలు నెటిజన్ల ను కట్టిపడేశాయి. అయితే పహల్గామ్ ఉగ్రదాడిపై భారతసైన్యం చర్యను ప్రశ్నిస్తూ ఒక పాకిస్తానీ యూజర్ వేసిన వ్యాఖ్యకు బదులుగా ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పనోలీ మే 14న పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పాకిస్తాన్ పట్ల మెతక వైఖరిని ప్రదర్శిస్తున్న బాలీవుడ్ ప్రముఖులను, యూట్యూబర్ రణ్వీర్ అల్లాహ్ బాదియాను పరుష పదజాలంతో, అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో దుమ్మెత్తిపోశారు. అయితే ఆ వీడియోపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆమెను అరెస్టు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.

దాంతో పనోలీ దానిని తన అకౌంట్ నుంచి డిలీట్ చేశారు. క్షమాపణ చెప్పారు. భారతీయ న్యాయ సంహితలో పలు సెక్షన్ల కింద మతాలమధ్య శతృత్వాన్ని ఎగదోస్తూ, మతపరమైన భావోద్వేగాలను కించపరుచుస్తున్నారనే అభియోగంతో కోల్కతా పోలీసులు ఆమెపై ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు. లీగల్ నోటీసులు జారీ చేశా రు. దొరక్కుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారని శర్మిష్టను, ఆమె కుటుంబాన్ని పోలీసులు నిందించారు. ఆమెపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చివరకు మే 31న గురుగ్రామ్ శర్మిష్టను అరెస్టు చేసారు. అలీపుర్ కోర్టులో హాజరుపరిచారు. అయితే శర్మిష్ట దగ్గర ఉన్న డిజిటల్ సాక్ష్యాలను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నందున ఆమెను పోలీస్ కస్టడీకి అవసరం లేదని పనోలీ తరఫు న్యాయవాది వాదించారు. బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు శర్మిష్ఠను జూన్ 13 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. కోర్టును వెలుపలకు వచ్చిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ విధమైన వేధింపులు ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తున్నాయి అని అన్నారు.

Tags

Next Story