కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. కిటికీల నుండి దూకిన విద్యార్థులు

ఢిల్లీ కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులు కిటికీల నుండి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వాయువ్య ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది, దీంతో విద్యార్థులు కిటికీల నుండి దూకారు. 11 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, మధ్యాహ్నం 12.30 గంటలకు మంటలు చెలరేగాయి. విద్యా సంస్థలో మంటలు చెలరేగడంతో విద్యార్ధులు తమను తాము కాపాడుకునేందుకు బాల్కనీల్లో నుంచి దూకడం. వైర్ల ద్వారా కిందికి దిగడం వంటివి చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
"ఎలక్ట్రిక్ మీటర్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. మంటలను త్వరగా గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అగ్నిమాపక డైరెక్టర్ అతుల్ గార్గ్ అన్నారు.అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయని, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు."భవనం నుండి ప్రజలందరినీ రక్షించారు. అగ్నిమాపక ఆపరేషన్ ముగిసింది. ఇప్పటివరకు, పెద్ద గాయాలు ఏవీ నివేదించబడలేదు" అని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com