HMPV Virus in Gujarat : గుజరాత్‌లో తొలి HMPV వైరస్ కేసు: దేశంలో ఎన్నంటే?

గుజరాత్‌లో తొలి HMPV వైరస్ కేసు నమోదైనట్టు సమాచారం. అహ్మదాబాద్ చాంద్‌ఖేడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పేషంట్ చేరినట్టు తెలిపింది. ఆ చిన్నారి వయసు రెండేళ్లని పేర్కొంది. దీంతో దేశంలో ఈ కేసుల సంఖ్య మూడుకు చేరుకున్నట్టైంది. బెంగళూరులో మూడు, ఎనిమిది నెలల చిన్నారులకు HMPV సోకినట్టు ICMR ఉదయం ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. చిన్నారులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతోంది.
HMPV భారత్‌లో ప్రవేశించడంతో మళ్లీ కరోనా నాటి పరిస్థితులు దాపురించేలా ఉన్నాయి. కార్పొరేట్ కార్యాలయాలతో పాటు రద్దీ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు మాస్కులు ధరించేలా యాజమాన్యాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. జనాల తాకిడి ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇకపై మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. బెంగళూరులో ఇవాళ ఒక్క రోజే 2 HMPV పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. బెంగళూరులో ప్రమాదకర HMPV వైరస్ కేసులు నమోదవ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో తమవద్దనున్న షేర్లను తెగనమ్ముతున్నారు. సెన్సెక్స్ 1200 పాయింట్లు నష్టపోయి 78,000, నిఫ్టీ 320 పాయింట్లు పతనమై 23,680 వద్ద ట్రేడవుతున్నాయి. ఫలితంగా రూ.5లక్షల కోట్లమేర సంపద ఆవిరైంది. ఇండియా విక్స్ నేడు 12.61% పెరగడం గమనార్హం. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com