ఢిల్లీలో మారని పరిస్థితులు.. ఆలస్యంగా నడుస్తోన్న విమానాలు
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీస్తోన్న చలిగాలులు అనేక ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉంది.
ఢిల్లీలో చలికాలం ఆరంభం నుంచి పలు వాతావరణ మార్పులు, చలిగాలులు, పొగమంచు కారణంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న చలి, పొగమంచుతో రహదారులు సరిగ్గా కనిపించక నానా అవస్థలు పడుతున్నారు. ఇది ఫిబ్రవరి 11న ఉదయం కూడా కొనసాగింది. నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు తమను తాము వెచ్చగా ఉంచుకోవడానికి మంటల వేసుకుంటూ కాస్త ఉపశమనం పొందుతున్నారు.
విజిబిలిటీ సమస్యల కారణంగా ఆదివారం కూడా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. గత వారం, ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలో తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు కొనసాగింది. దీని వల్ల ఢిల్లీకి వచ్చే విమానాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com