West Bengal : బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ అంత్యక్రియలు

వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్య మంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్లు. ఆయన 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా చేశారు. 2000 నుంచి 2011 వరకు ఆయన బెంగాల్ ఆరో సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం పూర్తిచేస్తున్నారు. సీపీఐ ఆఫీస్ లో ఆయన పార్ధివదేహానికి సీనియర్ నేతలు, పార్టీలకు అతీతంగా నాయకులు నివాళులు అర్పించారు.
బెంగాల్లో సుమారు 34 ఏళ్లు వామపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ఏలాయి. దాంట్లో చివరి సీఎంగా బుద్దదేవ్ విధులు చేపట్టారు. కోల్కతాలోని పామ్ అవెన్యూలో గురువారం ఉదయం 8.30 నిమిషాలకు ప్రాణాలు విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చాన్నాళ్ల నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. శ్వాసకోస వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. పలుమార్లు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఇటీవల న్యూమోనియా సోకడంతో ఆయన లైఫ్ సపోర్టుపై ఉన్నారు.
మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య మృతి పట్ల.. బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి సంతాపం తెలిపారు. ఆయన మరణం తీవ్ర మనస్తాపాన్ని కలిగించినట్లు చెప్పారు. కుటుంబసభ్యులు, అభిమా నులకు సంతాపం తెలుపుతున్నట్లు తన ఎక్స్ అకౌంట్ లో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com