మాజీ మంత్రి ఇంట్లో ఈడీ దాడులు.. కోట్ల విలువైన క్యాష్, గోల్డ్ సీజ్

మనీలాండరింగ్ విచారణలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు, ఉత్తరాఖండ్ మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్, అతని సహచరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహించింది. దాదాపు రూ.1.20 కోట్ల విలువైన భారతీయ, విదేశీ కరెన్సీలతో పాటు బంగారంతో పాటు గణనీయమైన సంఖ్యలో డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ వెల్లడించింది. అయితే, రికవరీ చేసిన వస్తువులకు సంబంధించిన నిర్దిష్ట వివరాలను మాత్రం అధికారిక ప్రకటనలో వెల్లడించలేదు.
ఫిబ్రవరి 7న ప్రారంభమైన ఈ దాడులు ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానాలోని మొత్తం 17 ప్రాంతాలను కవర్ చేశాయి. దర్యాప్తు ప్రాథమికంగా రావత్‌తో సంబంధం ఉన్న వ్యక్తులపై దృష్టి సారించింది. ఇక 63 ఏళ్ల రావత్ రాష్ట్ర మాజీ అటవీ శాఖ మంత్రి. 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ వ్యక్తులపై తమ దర్యాప్తు రాష్ట్రంలో నమోదైన రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల నుండి వచ్చినట్లు ఈడీ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com