Kallikot : కళ్లికోట్ రాజమాత కన్నుమూత

కళ్లికోట్ రాజమాత,ఒడిశా మాజీ ఎమ్మెల్యే వి సుజ్ఞాన కుమారి డియో (Sujana Kumari Dio) కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అర్ధరాత్రి 12.44 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
1961లో తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన సుజ్ఞాన కుమారి డియో 2014లో కబీసూర్యనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న తర్వాత ఆమె చెన్నైకి వెళ్లారు. ఖల్లికోట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఎనిమిది సార్లు ప్రాతినిధ్యం వహించగా.. కబీసూర్యనగర్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సుమారు ఆరు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. ఎన్నడూ మంత్రి పదవిని ఆమె ఆశించలేదు.
వాస్తవానికి చెన్నైకి చెందిన డియో, ఖల్లికోట్ యొక్క పూర్వపు రాజ వంశస్థుడైన పూర్ణ చంద్ర మర్దరాజ్ డియోను వివాహం చేసుకున్నారు. ఒడిశా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో ముఖ్యమైన పాత్ర పోషించిన రాజా రామచంద్ర మర్దరాజ్ డియో కోడలు ఈమె. డియో ప్రతిష్టాత్మక మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు. డియో మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకుల సంతాపం తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com