RG Medical College : ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌పై వేటు

కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వివాదాస్పద మాజీ ప్రిన్సిపల్ డా.సందీప్ ఘోష్‌పై బెంగాల్ ప్రభుత్వం వేటువేసింది. నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పిస్తూ ఆరోగ్య శాఖ ఉత్తర్వులిచ్చింది. డా.ఘోష్‌పై విచారణ జరపకుండా బదిలీ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అలాగే ఆర్జీ కర్ కాలేజీ ప్రస్తుత ప్రిన్సిపల్ సుహృత పాల్‌ను కూడా ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించింది.
కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్ ఆస్పత్రిలో అనాథ శవాలను అమ్ముకొనేవాడని కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ ఆరోపించారు. అలాగే బయోమెడికల్ వ్యర్థాలను బంగ్లాదేశ్‌కు రవాణా చేసే నెట్‌వర్క్‌లో భాగం కావడం వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డాడని తెలిపారు. ఆస్పత్రి, కళాశాలకు సంబంధించిన ఏ పని చేయడానికైనా డబ్బులు వసూలు చేసేవాడని అలీ చెప్పారు.
కోల్‌కతా హత్యాచార ఘటన నిందితుడు సంజయ్ రాయ్ వాంగ్మూలం, ట్రైనీ డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా CBI అధికారులు అతడికి సైకోఅనాలసిస్ చేశారు. అందులో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూసినట్లు తెలుస్తోంది. వికృతమైన సెక్స్ అలవాట్లకు బానిస అయ్యాడని, జంతువులా ప్రవర్తించేవాడని అధికారులు గుర్తించారు. విచారణలో అతడు ఏమాత్రం భావోద్వేగానికి గురికాలేదని, ఎలాంటి తొందరపాటు లేకుండా జవాబులు చెప్పాడని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com